ఒక పురుషుడు, స్త్రీ, వివాహిత దంపతులు లేదా తల్లిదండ్రులకు ఈ సాధనాలు వారు క్రీస్తులో నిలిచియుండడానికి బోధించడంలో సహాయం చెయ్యడానికి బైబిల్ ఆధారిత చేతి పుస్తకములను అందిస్తాయి.
తెలుగు శిష్యత్వ వనరులు
తర్ఫీదు వీడియోలు
పాస్టర్ క్రెయిగ్ లేఖనాల నుండి ఒక ఉపదేశాన్ని పంచుకుంటున్నారు, శిష్యత్వం గురించి దేవుడు చెప్పే దాని గురించి కాపరులను మరియు విశ్వాసులందరినీ ప్రోత్సహిస్తున్నాడు. శిష్యత్వం అంటే ఏమిటి మరియు యేసు తన సంఘానికి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడం ఎందుకు మూలాధారమైనది అనే దాని గురించి మీరు స్పష్టమైన దర్శనాన్ని వింటారు.
త్వరలో రాబోతుంది
పి.డి.ఎఫ్ ను డౌన్ లోడ్ చెయ్యండి.
కాపరి సంబంధమైన ప్రశ్నావళి
ఈ ప్రశ్నలు నాయకులు తమ పరిచర్య శిష్యత్వంతో ఏవిధంగా పనిచేస్తుందో పరిశీలించడానికి మరియు అంచనా వేయడానికి సహాయం చేస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు శిష్యులను చేయడం ప్రాధాన్యతగా ఉన్నదా మరియు వారిని సిద్ధపరచు ప్రక్రియ విశ్వాసులకు సరిగానూ, స్పష్టంగానూ ఉన్నదా లేదా అని బయలుపరుస్తుంది.
శిష్యత్వం దర్శనాన్నీ, వ్యూహాన్నీ కలిగియుంటుంది.
క్రైస్తవ సంఘం ప్రాధాన్యతలు, సాధనాలు మరియు వ్యూహాలతో దేవుని పిల్లలను శిష్యులుగా సిద్ధపరచడం, దాని గురించిన స్పష్టమైన దర్శనాన్ని పొందడంలో సహాయపడే ఉద్దేశ్యంతో ఈ రూపురేఖలు వ్రాయబడ్డాయి. మీ సంఘంలో శిష్యత్వాన్ని అమలు చేయడానికి ఈ సమాచారం మీకు సహాయకారిగా ఉంటుందని మేము నిరీక్షిస్తున్నాము.
క్రైస్తవ మూలాధార సత్యాలు
దేవునితో సన్నిహిత, ఆధారపడదగిన సంబంధాన్ని కలిగి ఉండటమే రక్షణ ద్వారా పొందిన అత్యంత శ్రేష్టమైన వరం. క్రీస్తుతో ఏవిధంగా ఐక్యం కావాలి మరియు ఆయనను మహిమపరిచే జీవితాన్ని ఏవిధంగా జీవించాలి అని నేర్చుకోవడం కోసం శిష్యత్వం అనేది దేవుని రూపకల్పనై ఉంది. క్రైస్తవ విశ్వాసం గురించి విశ్వాసులందరూ నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన బైబిలు సత్యాలను ఈ ధ్యానపూరిత చేతి పుస్తకం వెల్లడిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మనం నిలబడే మన బండ, అయితే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ పునాది బలహీనంగా ఉన్న యెడల, ఇది వారి జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. శిష్యులుగా సిద్ధపరచబడుచున్న వారికీ మరియు ఇతరులను శిష్యులుగా సిద్ధపరచుచున్న వారికి కూడా ఇది ఒక గొప్ప సాధనం.
వివాహం ఒక పరిచర్య
5 పుస్తకముల ఈ శ్రేణి వివాహం కోసం దేవుని ఉద్దేశాలను త్రవ్వి తీస్తుంది, భార్యాభర్తల పాత్రలను స్పష్టం చేస్తుంది, మరియు వివాహం కోసం దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాలను పరిశోధిస్తుంది, మరియు భార్యాభర్తలు ఒకరికొకరు ఏవిధంగా పరిచర్య జరిగించాలో నిర్దిష్ట ఉదాహరణలను అందిస్తుంది. నూతనంగా వివాహం అయిన దంపతుల కోసం, ఇప్పటికే దృఢమైన వివాహాన్ని మరింత బలోపేతం చెయ్యడానికి, ఆలోచన చెప్పి నడిపించే సాధనం గానూ, ఇతరులనూ లేదా చిన్న గుంపులనూ శిష్యులుగా సిద్ధపరచడంలో ఉన్నతంగా ఉపయోగపడుతుంది.
తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య
4 పుస్తకముల ఈ శ్రేణి పిల్లలను ప్రేమించడం, పోషించడం, మరియు వారు నడువవలసిన మార్గంలో వారిని తర్ఫీదు చెయ్యడంలో దేవుడు అనుగ్రహించిన తల్లిదండ్రుల పాత్రలను త్రవ్వి తీస్తుంది. మంచి మాదిరులు లేని తల్లిదండ్రులను వడిపించడంలో ఇది సహాయపడుతుంది మరియు తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం కోసం దేవుని చిత్తం మరియు ఉద్దేశ్యానికి స్పష్టతను ఇచ్చే బైబిలు సూత్రాలనూ, సత్యాలనూ అందిస్తుంది. పిల్లలను పరిణతి చెందిన వయోజనులుగా పెంచడానికి స్పష్టమైన కార్య ప్రణాలళికను ఈ శ్రేణి అందిస్తుంది.
క్షమాపణ & సమాధానపరచబడడం
క్షమాపణ యొక్క బైబిలు సూత్రాలు మరియు విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్దరించే దశలను ఈ 14-పేజీల చేతిపుస్తకం స్థిరపరుస్తుంది. వ్యక్తిగత అధ్యయనానికి లేదా ఆలోచన చెప్పి నడిపించడానికి ఇది ఒక గొప్ప సాధనం.